అబద్ధపు అభిమానుల్లారా.. మీ కన్నీటికి నేను బాధ్యుడను కాను: వర్మ

  • ప్రేమికుల రోజున 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ విడుదల
  • వెన్నుపోటుకు నిజమైన అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ వర్మ ట్వీట్
  • ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండాలంటూ చురక
వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లు చేస్తూ తన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు రామ్ గోపాల్ వర్మ ఫుల్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మరోవైపు ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని కూడా తనదైన శైలిలోనే వర్మ ప్రకటించారు.

'ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. ఉదయం 9:27 గంటలకల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు.' అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
lakshmis ntr
trailer
ram gopal varma
rgv
tollywood

More Telugu News